Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు చెల్లించాలని ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ, ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి సోలార్ గేటు ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, సిఐటియు, ఐఎఫ్టియు నేతలు తాళ్లూరు కృష్ణ యాకుబ్షావళి మాట్లాడారు. సోలార్ ప్లాంటులో పనిచేసే ఎలక్ట్రిషన్ సెక్యూరిటీ గార్డులు గ్యాస్ కటింగ్, కార్మికుజీ తాలు మొదటి వారంలోనే చెల్లించాలని అన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు సెంట్రల్ జీవో అమలు చేస్తుంటే సోలార్ లో మాత్రం స్టేట్ జీవో ఇస్తున్నారని ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చినా యాజమాన్యం ముందుకు రావడం లేదని విధులు బహిష్కరించినట్లు తెలిపారు. ప్రతి నెలజీతం 20 తారీకు లోపల ఇస్తున్నారని అన్నారు. అనంతరం బీహెచ్ఈ ఎల్ ఇన్చార్జి జవాకర్, కాంట్రాక్టర్ సాయికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సాయంత్రం వరకు జీతాలు వేస్తానని హామీ ఇచ్చారు సెంట్రల్ జీవో అమలు కోసం రేపు డేటు తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు పాయం వెంకన్న, శక్రు సోలార్ ఇరుసంఘాల నాయకులు రాజు కృష్ణ, బాలు, శంకర్, తదితదితరులు పాల్గొన్నారు.