Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు నిధుల నుంచి మందలపల్లికి పది లక్షల విలువైన రెండు రోడ్లు మంజూరు చేయగా అంబేద్కర్ కాలనీ కి వెళ్ళే రోడ్ కు శంకుస్థాపన చేసి పొయ్యడం జరిగింది. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా కాలనీలోకి వెళ్ళడానికి సరైన మార్గం లేక ఇబ్బందిపడుతున్న కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చూపిన ఎంపీ నామాకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్ ల మంజూరు కొరకు అహర్నిశం శ్రమించిన దిశ కమిటీ సభ్యుడు, ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. దిశ కమిటీ సభ్యుడు గారపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న హై స్కూల్ రోడ్ కు ఉపాధి హామీ పథకం ద్వారా 9 లక్షలు ఇప్పుడు ఎంపీ నిధులనుంచి 10 లక్షలు మంజూరు చేయించిన పేదల మనిషి ఎంపీ నామా కు గ్రామస్తులు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదివి దుర్గ, ఎంపీటీసీ దేవరపల్లి అజరు కుమార్, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వర రావు ఉపసర్పంచ్ సూర్యనారాయణలను గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు, కనపర్తి ధర్మారావు, గంజి రామారావు, దార వెంకటేశ్వరరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.