Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ఈపీ - జాతీయ విద్యావిధానం రద్దు చేయాలని, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిడీఈఓ, పీజీ హెచ్ఎం,ఎస్ఎ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు డిమాండ్ చేసారు. ఈ సంఘం మండల మహాసభ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పూర్వ అద్యక్షులు మడివి క్రిష్ణా రావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని, మిడ్డే మీల్ వర్కర్ల జీతాలు పెంచాలని,వర్క్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ఎస్.జీ.టీ లను ఉన్నత పాఠశాలలకు పంపడాన్ని రద్దు చేయాలని, 317 లో నష్టపోయిన ఉపాధ్యాయులకు సర్వీసు ప్రొటెక్షన్ అందించాలని, పాఠశాల గ్రాంట్ మంజూరు చేయాలనీ,ఉపాధ్యాయుల ఎస్.ఎల్,ఎంఆర్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మండల కమిటీ ని ఎన్నుకున్నారు.ఇందులో అధ్యక్షులుగా తాళ్ళపాటి వీరేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి గా ఎం.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలకు ప్రారంభానికి సూచకంగా సంఘం పతాకాన్ని సీనియర్ ఉపాధ్యాయులు రమణయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జే.మురళి మోహన్, దమ్మపేట బాధ్యులు ఆర్.రమేష్ కుమార్, ప్రసాద్, అశ్వారావుపేట బాధ్యులు కాపుల హరినాథ్ బాబు, రమణయ్య, కె.రజని, కే.విజయలక్ష్మి, కుంజా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.