Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ ఇంటి వాళ్ళని చేస్తున్న శ్రీ సిటీ ఫ్రైడ్
- ప్రజల నుంచి మంచి పేరు విశ్వాసాన్ని చూరగొనాలి
- వెంకట్రావు మొండి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు
- ప్రారంభోత్సవంలో సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు
నవతెలంగాణ ఖమ్మం (ఖమ్మంరూరల్)
రియల్ ఎస్టేట్ రంగంలో అవసరాలను తీర్చడం, ఆస్తులకు భద్రత కల్పించడమే ధ్యేయంగా వ్యవహరించాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొనుగోలుదారులు ఆస్తులు భద్రతా భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేస్తారని, అటువంటి వారి ఆశలను నెరవేర్చడంలో గరికపాటి విజరు సీఈఓ వ్యవహరిస్తున్న శ్రీ సిటీ యాజమాన్యం ఓ ఇంటి వారిని చేస్తుండటం గొప్ప విషయంగా అభివర్ణించారు. గురువారం ఖమ్మంరూరల్ మండలం ఆరెంపుల పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసిటీ ఫ్రైడ్ వెంచర్ ప్రారంభోత్సవాన్ని పువ్వాడ నాగేశ్వరరావు- విజయమ్మ దంపతులు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరికి పూర్ణకుంభం, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పువ్వాడ మాట్లాడారు. శ్రీసిటీ పేరుపై వెంచర్ 1, 2ను పూర్తి చేసుకుని, శ్రీసిటీ ఫ్రైడ్ అని నూతనంగా ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం అన్నారు. రోడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు ఏ వెంచర్‌లోనైనా వస్తాయి కానీ ప్రజలను మోసం చేయకుండా న్యాయంగా పని చేసినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు. ఆ గుర్తింపును సాధించి ఈ స్థితిలో వెంకట్రావ్ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయనది చాలా మొండి పట్టుదల అని, అనేక కష్టాలను ఎదుర్కుని ఈ స్థాయికి వచ్చారన్నారు. వారి తమ్ముడు ఆంజనేయ ప్రసాద్ కృషి కూడా గొప్పదన్నారు. ఇది అందరి ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పాటు చేసిందిగా తాను భావిస్తున్నానన్నారు. శ్రీసిటి ఫ్రైడ్ అందరి దగ్గర మంచి పేరును విశ్వసం సంపాదిస్తుందన్నారు. ఆయన బాబు కూడా ఇక్కడే ఉంటూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటుండటం మంచి పరిణామం అన్నారు. ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ముందుకి సాగాలన్నారు. శ్రీసిటీ గ్రూప్ చైర్మన్ గరికపాటి వెంకట్రావ్ మాట్లాడుతూ.... శ్రీసిటీ ఫ్రైడ్ అనేది కొత్తనామకరణం అని, ఇది అన్ని హంగులతో ఏర్పాటయిందన్నారు. రియల్ రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుందని, ఓ కుటుంబ ఇంటి కలను నెరవేర్చలేకపోతున్నామన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సర్పంచ్ చింతమల్ల పద్మ, వెంచర్ నిర్వాహకులు ఆంజనేయ ప్రసాద్, మన్నేటి నాగేశ్వరరావు, కారం శ్రీను, షాబాద్ మాధవరెడ్డి, ఘనపరపు వీరన్న, రేచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.