Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
గడిచిన 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వని మోడీ ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. గురువారం ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టిఆర్ఎస్ కేవి, ఐఎన్టియుసీ ినాయకులు మాట్లాడుతూ గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ప్రారంభించబడి సంవత్సర కాలం పాటు నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడానికి రావడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రజలు, కార్మికులు గ్రహించాలన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మోడీ పర్యటన చేస్తున్నారు తప్ప మరొకటి లేదన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారా లేదా తేల్చి చెప్పాలన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని కార్మికులందరూ కలిసి ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. 12వ తేదీన ఖమ్మం నగరంలో జరిగే నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ కేవి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా, ఐఎన్టియుసి జిల్లా నాయకులు సిహెచ్ విప్లవ కుమార్, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావి శివరామకృష్ణ, అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు పాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.