Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
ఖమ్మం పార్లమెంటు పరిధిలో రహదారుల మరమ్మత్తుల, నిర్మాణాల కోసం 200 కిలోమీటర్లకు 126 కోట్లు మంజూరైనట్లు ఖమ్మం పార్లమెంటు సభ్యులు బిఆర్ఎస్ లోకసభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిధిలోని కలకోట- నారాయణపురం బిటి రోడ్డుకు నామా నాగేశ్వరరావు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 2.54 కోట్లు మంజూరయ్యాయి. గతంలో ఈ రోడ్డు నిర్మాణం పనులు జరిగాయి. అయితే కలకోట చెరువు కట్ట పక్క నుంచి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేయవలసి ఉంది. ఆనాడు గ్రామస్తుల చెరువు కట్ట మీదుగా రోడ్డు వేయాలని కోరారు. దీంతో చెరువు కట్ట మీదుగా ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క కోరిక మేరకు చెరువు కట్టను టూరిజం కేంద్రంగా మార్చేందుకు అవసరమైన కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలు రాజకీయాలకతీతంగా కలిసి పనిచేయాలని కోరారు.కలకోట చెరువును టూరిజ కేంద్రముగా మార్చటం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మధిర ఎంఎల్ఏ భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో బోడెపుడి వేణు మాధవ్, కలకోట, నారాయణ పురం సర్పంచులు యంగల దయామని, సాదినేని చంద్రకళావతి కలకోట ఎంపిటిసి యంగల మారుతమ్మ, కలకోట సొసైటీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జంగాల రవికుమార్, సర్పంచులు జెర్రిపోతుల రవీంద్ర, కొమ్మినేని ఉపేందర్, భాగం శ్రీనివాసరావు, పెరబత్తిని శాంతయ్య, రైతు బంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు పాల్గొన్నారు.
మోటమర్రిలో సిసి రోడ్లకు శంకుస్థాపన
మోటమర్రి గ్రామపంచాయతీ పరిధిలో బీసీ కాలనీలో ఐదు లక్షలతో ఎస్సీ కాలనీలో ఐదు లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లకు ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మోటమర్రి సర్పంచ్ కేతినేని ఇందు, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వ రరావు ఎంపీపీ కంకణాల సౌభాగ్యం తాసిల్దార్ రావూరి రాధిక ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ ఎంపీ ఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాయతీ కార్యదర్శి వెంకట జోగారావు, మాజీ జడ్పిటిసి బానోతు కొండ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మధిర : ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం మధిర పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలసి పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా ఇటీవల కాలంలో మరణించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులు సి.హెచ్ విజరు కుమార్ ఇంటికి వెళ్లి వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలానే కొనా జగదీష్ తండ్రి మరణించగా వారి కుటుంబ సభ్యులను, 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వరరావు సతీమణి మరణించగా వారి కుటుంబ సభ్యులను, షైక్ ఖరీమ్ తండ్రి మరణించగా వారి కుటుంబ సభ్యులను, విశ్రాంత ఉపాధ్యాయులు యన్నం సుంకిరెడ్డి మరణించగా వారి కుటుంబ సభ్యులను, జీలుగుమాడు గ్రామంలో చిన్నంశెట్టి పద్మ మరణించగా వారి కుటుంబ సభ్యులను, దెందుకూరు గ్రామంలో కొడవటి రాధిక మరణించగా వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ళకి వెళ్లి చిత్రపటాలకు నివాళులు అర్పించి పరామర్శించారు.
ముదిగొండ : రూ10 లక్షల వ్యయంతో వల్లభి మేజర్ పంచాయతీలో నిర్మించిన సిసి రోడ్డును ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి గురువారం లాంఛనీయంగా ప్రారంభించారు. తొలిత గ్రామసర్పంచ్ పోట్ల కష్ణకుమారి దంపతులు ఆధ్వర్యంలోఎంపీ నామ నాగేశ్వరరావుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వనంవారికిష్టాపురం గ్రామాన్ని నామ సందర్శించి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీరుకొండ సతీష్ స్వగృహంకు వెళ్లి ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పిటిసి పసుపులేటి దుర్గ, గ్రామసర్పంచ్ పోట్ల కృష్ణకుమారి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు చింతలచెరువు లక్ష్మి, గ్రామ నాయకులు పొట్ల రవి, రాజుల కోటయ్య, కొండా విజయభాస్కర్, ఏనుగుల బాబురావు, చిరుమర్రి గ్రామ ఉపసర్పంచ్ వినుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.