Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్
- అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరికి వినతి
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
బైపాస్ రోడ్‌కు నూతన బస్టాండ్ రాకతో ఎన్ఎస్టి రోడ్ నుండి సరితా క్లినిక్ సెంటర్ వరకు 80 అడుగుల రోడ్డు వెడల్పు విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఎస్టి రోడ్ ఇరువైపులా హాస్పిటల్స్ వుండటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుందని, చివరికి టూ వీలర్ వాహనదారులు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి, పాత బస్టాండ్ నుంచి, వైరా రోడ్ నుండి ట్రాఫిక్ అంతా నూతన బస్టాండ్ వెళ్ళే ఎన్ఎస్టి రోడ్ రహదారి చిన్నగా వుండటం వలన పలుసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోలు, కార్ల సంఖ్య పెరగటంతో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుందని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వెంటనే ఈ రహదారిను 80 అడుగుల రహదారిగా వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ ప్రజా సమస్యపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, జె.వెంకన్న బాబు, భుక్యా ఉపేంద్ర, సిహెచ్ భద్రం, శెట్టి రవీంద్ర, పి.వాసు, మల్లికార్జున్‌రెడ్డి, ఎస్కె బీబీ తదితరులు పాల్గొన్నారు.