Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధిలోని కారేపల్లి, కామేపల్లి, ఏన్కూర్ మండలాలలో పేదలు సాగు చేస్తున్న పోడును ఫారెస్టు అధికారులు ప్రత్యామ్నాయ పోడు చూపుతామని బలపంతంగా లాక్కొన్నారని వారికి న్యాయం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పేదలు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కలిశారు. గిరిజన సంఘం నాయకులు భూక్యా వీరభద్రం, దుగ్గి కృష్ణ, వజ్జా రామారావు ల ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసిన పేదలు తమ భూములను సర్వే చేసి హక్కు కల్పించాలని కోరారు. ఫారెస్టు అధికారులు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని, పోడు రైతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. పోడు సర్వేలో ఎఫ్ఆర్సీ కమిటీని కూడా ఫారెస్టు అధికారులు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేదలు సాగుచేసుకుంటున్న పోడును సర్వే చేసిహక్కులు కల్పించాలని దురుసుగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వారు కోరారు. ఈకార్యక్రమంలో బాధిత రైతులు చల్లా కృష్ణ, భూక్యా రమేష్, అరుణకుమారి, నర్సమ్మ, కిరణ్, వీరభద్రం, పద్మ, కౌసల్య, బిక్షం చిలుముల జానకమ్మ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.