Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో పార సత్యనారాయణ , ఆర్జెసి కృష్ణ, బచ్చు విజరు
నవతెలంగాణ- ఖమ్మం
గత రెండు రోజులుగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నారని మున్నూరుకాపు సంక్షేమ సంఘం నాయకులు పార సత్యనారాయణ, ఆర్జెసి కృష్ణ, బచ్చు విజరుకుమార్ ఆరోపించారు. గురువారం ఖమ్మంలోని సీక్వెల్ లెక్యూవ్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్నూరు కాపు కుల పెద్దలపై ఈడి, ఇన్కమ్ టాక్స్ దాడులతో అణగదొక్కాలని చూస్తున్నారని, ఇది ముమ్మాటికీ మా జాతి, మా కుల పెద్దలపై జరుగుతున్న దాడి అన్నారు. బీజేపీ రానున్న రోజుల్లో తగ్గిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. సమావేశంలో నాయకులు శీలంశెట్టి వీరభద్రం, శరత్, ఆకుల గాంధీ, విజరు కుమార్ పాల్గొన్నారు.