Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రానికి నిధుల ఇవ్వకుండా, పన్నుల వాటాన్ని సక్రమంగా పంచకుండా రాష్ట్రంపై వివక్షత చూపే నరేంద్ర మోడీ రాకను ప్రజలు నిరసించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరం కాలం తరువాత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం ఏమిటని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని వారు దుయ్యబట్టారు. ఈనెల 12వ తేదీన మోడీ రాకను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఖమ్మం పాత బస్టాండ్ సెంటర్లో సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కొండపర్తి గోవిందరావు, తాటి వెంకటేశ్వర్లు, తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.