Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎర్రుపాలెం
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని, ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించి పదోన్నతులు చేపట్టాలని ఇందుకు అవసర మైన షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ ఎర్రుపాలెం మండల మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్ర మైన ఎర్రుపాలెం సిపిఎస్ పాఠశాల నందు 9వ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు బండారు నాగరాజు అధ్యక్షతన నాగటి నారాయణ ప్రాంగణంలో జరిగిన తొమ్మిదవ మండల మహాసభ లో జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు పారుపల్లి నాగేశ్వరరావు, రావిరాల లక్ష్మణరావు ,షేక్ రంజాన్ పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 20వ తేదీన వైరాలో జరుగు ఖమ్మం జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు షేక్ నాగూర్ వలి ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మండల మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా అనుమోలు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కే.శ్రీనివాస రావు, వై.నాగమణి, కోశాధికారిగా నాగేశ్వర రావులను ఎన్నుకున్నారు. తొలుత మహాసభల ప్రారంభంలో టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు ఎన్ అజరు కుమార్ ఆవిష్కరించారు. మహాసభలో ఎన్ వెంకటేశ్వర్లు, రవి పుష్పావతి, వెంకమ్మ, సీతా మహా లక్ష్మి, రత్నమ్మ, జి.శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.