Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
నూతన జాతీయ విద్యావిధానం 2020తోపాటు, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యూటిఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో(నాగాటి నారాయణ ప్రాంగణం) నందు యూటిఫ్ తొమ్మిదోవ మండల మహాసభ మండల అధ్యక్షడు బి తిరుమల ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సభలో పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా మాజీ అద్యక్షులు గడ్డం రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి, బదిలీలు నిర్వహించి పండిట్, పిఈటి పోస్టులను ఆప్ గ్రేడ్ చేయాలన్నారు. అదే విధంగా వైరాలో ఈ నెల 20వ తారీఖున నిర్వహించనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మండల విద్యాశాఖాధికారి యం.శాంసన్ మాట్లాడుతూ యూటిఫ్ సభ్యులందరు వృత్తి పట్ల అంకిత భావం కలిగి ఉండటమేకాక నిబద్ధతతో పని చేస్తారని కొనియాడారు. జిల్లా ఉత్తమ మండల విద్యాశాఖాధికారిగా ఎన్నిక అయిన యం.శ్యాంసన్‌ను యూటిఫ్ మండల కమిటి ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా జాతీయ పతాకాన్ని టిడబ్యూఏఎస్ ప్రధానోపాద్యాయులు సోమ్లా, ఎస్టిఎప్ఐ పతాకాన్ని జి.రాజశేఖర్ యూటిఫ్ పతాకాన్ని జి.బార్గవిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.రంజాన్, మండల ప్రధానకార్యదర్శి జిడిఎస్వీ రమణ, ఉపాద్యక్షులు కె.జ్యోతి, జమలయ్య, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సంతోష్, కొణిజర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు డి పుల్లయ్య, కె.రాములు, ఆర్.శ్రీనివాస్, సీనియర్ నాయకులు వై. కోటేశ్వరరావు, యం.నరసింహులు, యం ప్రసాదరావు, డి.శ్రీనివాన్, ప్రసాద్‌రావు, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.