Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఆర్థికంగా ఎదగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంజూరైన కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమానికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బోడా మంగీలాల్ నాయక్, జడ్పిటిసి బెల్లం శ్రీను, మండల రైతు బంధు కన్వీనర్ చావా శివరామకృష్ణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జల్లేపల్లి ఉపసర్పంచ్ భాషబోయిన వీరన్న, సర్పంచులు దేవరం దేవేందర్‌రెడ్డి, కొండబాల వెంకటేశ్వర్లు, వంచర్ల అలివేలమ్మ సత్యనారాయణరెడ్డి, మట్ట కరుణశ్రీ, కృష్ణారావు, గంట నిర్మల కృష్ణ, ఇస్లావత్ అచ్చమ్మ చంద్రనాయక్, డిప్యూటీ తాసిల్దార్ నరసింహారావు, ఎంపీడీవో జయరాం, ఎంపీఓ రాజేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లహరి, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.