Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కొత్తగూడెం కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మండె వీరహను మంతరావు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం పరిధిలోని పెనగడపలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండె వీరహనుమంతరావు మాట్లాడతూ కొత్తగూ డెం సహకార సంఘ పరిధిలోని సుజాతనగర్, వేపలగడ్డ, సింగభూపాలెం, గరీబ్ పేట, పెనగడప, చుంచుపల్లి, పెనుబల్లి, హేమచంద్రపురం, రేగళ్ల, దాతకొండ తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం గ్రేడ్ ''ఏ'' రకం ధర రూ.2,060, సాధారణ రకం ధర రూ.2040 ప్రభుత్వం నిర్ణయించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాధరావు. సొసైటీ సీఇఓ పండ్ల సారయ్య మాని టరింగ్ అధికారి కె.సందీప్ కుమార్, పెనగడప సర్పంచ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ
పినపాక : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శుక్రవారం గోపాలరావు పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పినపాక సహకార సంఘం అధ్యక్షులు వర్మ ఆధ్వర్యంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతులమీదుగా ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ సత్యం, తోగ్గూడెం ఉపసర్పంచ్ బుస్సిశ్రీను, పినపాక పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, సంఘ పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.