Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాంపు ప్రారంభంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-అశ్వాపురం
ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బిజీ కొత్తూరు గ్రామంలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ వైద్యురాలు గుమ్మడి అరుణ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు వారి అవసరం మేర వ్యాధులకు మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కమటం నరేష్, వార్డు మెంబర్లు కొల్లు ఉప్పల్ రెడ్డి, తెల్లం లక్ష్మి శాంత, అంగన్వాడీ టీచర్ శైలజ, ఆశా వర్కర్ సరస్వతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.