Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారులకు వరమని వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం అన్నారు. శుక్రవారం చెరువులలో ఆయన చాప పిల్లలను వదిలే కార్యక్ర మాన్ని చేపట్టారు. విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలు మేరకుమండలంలోని మిట్టగూడెం పంచాయతీ పరిధిలోని తీగలచేరువులో 24000, తురుమలగూడెం పంచాయతీలోని చింతలచెరువులో 36000 వేల చాప పిల్లలను వదిలారు.
తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలిన సర్పంచ్ మర్రి మల్లారెడ్డి :
మండల పరిధిలోని కాకతీయుల కాలంనాటి సుప్రసిద్ధ సాగునీటి వసరైన తుమ్మల చెరువులో మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మత్స్య శాఖ అధికారులతో కలిసి 8,70,000 చాప పిల్లలు, 4లక్షల 35 వేల రొయ్యపిల్లలను చెరువులో వదిలారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపపిల్లలపెంపకం ముదిరాజ్, మత్స్య సొసైటీల కుటుంబాలలో వెలుగులు నింపుతుందన్నారు.. ఈ కార్యక్రమాలలో ఎంపీటీసీ కమటం నరేష్, మత్స్యశాఖ అధికారులు కోటేశ్వరరావు, బాణోత్ వీరన్న, భార్గవ్, రాంబాబు, అనిల్, మంగరాజు, సర్పంచ్లు పర్షిక రాజమ్మ, కమల, కార్యదర్శిలు ఏ.ప్రవీన్ కుమార్, సవలం శాంతి, బీఆర్ఎస్ నాయకులు షేక్ నయీమ్, రామకృష్ణ, కిరణ్, కె.డేవిడ్, రాజశేఖర్, చుంచు రామ్మూర్తి, మన్మధ రెడ్డి, రామిరెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు.