Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి
నవతెలంగాణ పాల్వంచ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు సమస్యలపై విద్యాసదస్సు స్థానిక టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పాల్వంచలో యూటీఎఫ్ రెసిడెన్షియల్ పాఠశాలల బాధ్యులు ఎల్లయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, బోధనా సిబ్బందికి హాస్టల్ ఇంచార్జి బాధ్యతలు నుంచి మినహాయించాలని కోరారు. సమావేశంలో యూ టీఎఫ్ రాష్ట్ర రాజు కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు కిషోర్ సింగ్, కృష్ణ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జీవీ నాగమల్లేశ్వరరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, పాల్వంచ మండల అధ్యక్ష కార్యదర్శులు కే.రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ కే.వెంకటేశ్వర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.