Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివ్యాంగ సంకల్ప దీక్ష కరపత్ర ఆవిష్కరణ
నవతెలంగాణ-చండ్రుగొండ
సామాన్యుడు సమస్యలు కనపడని సీఎం కేసీఆర్ పెద్ద వికలాంగుడు అని జడ్పీటీసీ కొనకళ్ల వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (టీవీపీఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అడ్డాలో నిర్వహించనున్న దివ్యాంగ సంకల్ప దీక్ష (నిరాహారదీక్ష) కరపత్రాన్ని శుక్రవారం జడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల హక్కులను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు, ఉపాధిలో పట్టభద్రులైన దివ్యాంగులు సమస్యతో బాధపడుతున్నారు. ఈ కార్యక్రమంలో టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వజేఏసీ చైర్మన్ సతీష్ గుండవునేని, సభ్యులు ఖాసిం, కిరణ్, రాములు, బాబా, హుస్సేన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.