Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ఇరుకున పెట్టేందుకే ఎంపీలు, ఎమ్మెల్సీ, మంత్రులు ఇతర నాయకుల ఇళ్లపైన ఈడీ, ఐటీ దాడులను బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తుందని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మంలో గత 35 సంవత్సరాలుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ సంస్థలు, ఇండ్లపై ఈడీ, ఐటీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవలే టీఆర్ఎస్లో రవిచంద్ర ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన మునుగోడు బై ఎలక్షన్లలో బీజేపీ ఓటమి పాలవడం జీర్ణించుకోలేక పోతుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాదని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, చుంచుపల్లి ఎంపీపీ భాదావత్ శాంతి తదితరులు పాల్గొన్నారు.