Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి మాదంటే మాదంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ
- ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలంలో శుక్రవారం పోడు వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామంలో గలపోడు వివాదం ఘర్షణలకు తావుదీసింది. పోడు భూముల్లో సర్వే కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు బొమ్మ రాసిపల్లి, పెంటన్నగూడెం పోడు వివాదం తలనొప్పిగా మారింది. మాదంటే మాదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాదనతో పాటు ఘర్షణ కూడా దిగారు. దీంట్లో చిన్నపాటి కొట్లాట వాతావరణం కూడా చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇరు వర్గాలతో మాట్లాడి ఘర్షణ వాతావరణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతో కాలంగా సాగు చేస్తున్నామని ఒక వర్గం కాదు మేమే పోడు కొట్టామని మరొక వర్గం వివాదాస్పదానికి దారి తీయడంతో ఇరువర్గాలను పోలీసులు చదరగొట్టారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సర్వేను అధికారులు ఆపివేశారు. ఇరువర్గాల మధ్య వాదన కొట్లాటకు దారితీసి కేసుల దాకా వెళ్ళింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఇరువర్గాలకు న్యాయం చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.