Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజా సమస్యల పరిష్కారానికే అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం మండలంలో 13వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని మసీద్ రోడ్డు నుంచి సెంటర్ వరకు గల కాలనీలో శ్రీలత విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ స్తంభాలు, ఏర్పాటు ప్రజలు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. సమస్యలను త్వరగారితిన పూర్తి చేయాలని ఆమె కోరారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. వారి సహకారంతో అనేక గ్రామాలకు సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సారపాక టౌన్ అధ్యక్షులు కునకంచి శ్రీను, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లుకోటి పూర్ణ చందర్, మండల కార్మిక విభాగం నాయకులు మర్రి సాంబిరెడ్డి, విరంరెడ్డి సతీష్, బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు తదితరులు పాల్గొన్నారు.