Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి/వేంసూరు/ పెనుబల్లి
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం వేంసూర్, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ తదితర మండలాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులతో కలసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నామ సత్తుపల్లి పట్టణంలో పలు కుటుంబాలను పరామర్శించారు. వేల్పుల ప్రసాద్ తండ్రి ఇసాక్ ఇటీవల మీతి చెందారు. వారి కుటుంబాన్ని, దామెర రమేష్ తల్లి దామెర చంద్రావతమ్మ ఇటీవల చనిపోయారు. అదే విధంగా పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ కూసుంపూడి నర్సింహారావు, మున్సిపల్ ఛైర్మన్ కూసుంపూడి మహేష్, జెట్పీటీసీ కూసుంపూడి రామారావు, వేంసూర్ మండల రైతు బంధు అధ్యక్షులు వి. జగన్మోహన్ రావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగళ్ళ కృష్ణయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, కౌన్సిలర్లు చాంద్ పాషా, గఫార్, కంటే అప్పారావు, షేక్ నాగులమీరా, అద్దంకి అనిల్, దేవరపల్లి ప్రవీణ్, మారుతి సూరిబాబు, గుండ్ర రఘు పాల్గొన్నారు.
పాపకు నామ ఆశీస్సులు
సత్తుపల్లి అంబేద్కర్ నగర్ మూడో వార్డుకు చెందిన జొన్నలగడ్డ శ్రీను ఇంటిని ఎంపీ నామ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీను కుమారుడు శౌరీష్ అన్నప్రసన ను పురస్కరించుకుని నామ బాబును ఎత్తుకుని, ముద్దాడి, ఆశీర్వదించారు.
వేంసూర్ లో పరామర్శలు
కందుకూరులో గొర్ల సత్యనారాయణ రెడ్డి ( బుల్లిబాబు ) కుటుంబాన్ని నామ పరామర్శించారు. ఇటీవల సత్యనారాయణ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అడసర్లపాడులో ఒగ్గు కరుణాకర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ కూసంపూడి నర్సింహారావు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ అత్తునూరు రంగారెడ్డిని పరామర్షించిన ఎంపీ నామ
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ అత్తునూరి రంగారెడ్డిని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, వారి నివాస గృహానికి వెళ్లి శనివారం రాత్రి పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్, మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ , టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, కప్పలబందం సర్పంచ్ నందిగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.