Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతిని మోసం చేస్తున్న ప్రధాని
- సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం
- ముందస్తు అక్రమ అరెస్టులకు ఖండన
- జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు,పోటు ప్రసాద్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయడంతోపాటు కార్పొరేట్ సెక్టార్లకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని సీపీఐ(ఎం), సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. శనివారం మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆయా పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండు సెంటర్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం కాకుండా అదానీ, అంబానీ లాంటి కుబేరుల కోసం పని చేస్తున్నారని వారు విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఓవైపు ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తూ మరో పక్క రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పటం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ యిచ్చి లక్షలాది మంది ఉద్యోగులను, కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని, కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 2021 సం.లో పున: ప్రారంభమై లాభాల్లో నడుస్తున్న రామగుండం ఫెర్టిలైజర్స్ ఎరువుల కంపెనీని ఇప్పుడు జాతికి అంకితం యివ్వడం ఏమిటి అని అన్నారు. దీన్ని కూడా తన ఇద్దరు గుజరాత్ మిత్రులకు అప్పజెప్పటం కోసమే అని విమర్శించారు. 8 ఏండ్ల కాలంలో రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదని, వివక్షతతో రాష్ట్రాన్ని దివాళా తీయించే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజల కార్మిక, కర్షకుల నినాదమే మోడీ గోబ్యాక్ అని వారు అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులతో పాటు జిల్లా ప్రజా సంఘాల నాయకులను కూడా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, వై.విక్రం, యర్రా శ్రీనివాసరావు, జబ్బార్, నవీన్‌రెడ్డి, పి.రమ్య, భూక్యా శ్రీనివాస్, ఎస్.కె.మీరా, మధు, ప్రవీణ్, సిపిఐ జిల్లా నాయకులు ఎస్.కె.జానిమియా, పోటు కళావతి, కొండపర్తి గోవిందరావు, తాటి వెంకటేశ్వరరావు, సిద్దినేని కరుణకుమార్, 19వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ, తోట రామాంజనేయులు, గాదె లక్ష్మినారాయణ, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాస్, తాటి నిర్మల, నానబాల రామకష్ణ, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా ఎన్ఎఫ్ఐ.డబ్ల్యూ ఆధ్వర్యంలో
ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, మహిళా సంఘాలు కలిసి మోడీ దిష్టిబొమ్మను రోడ్డుమీద లాక్కుంటూ మోడీ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. అనంతరం మయూరి సెంటర్ లో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సెక్రెటరీ మాచర్ల భారతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు పోటు కళావతి, తాటి నిర్మల, ఐద్వా జిల్లా నాయకులు మెరుగు రమణ, మేహరున్నిస బేగం, పిన్నింటి రమ్య, ముక్కపాటి నాగమణి, భాగం అజిత, కత్తుల అమరావతి, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య ఆధ్వర్యంలో ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఎర్ర జెండాలు చేత బోని సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి రామిశెట్టి సురేష్, సిఐటియు మండల బాధ్యులు సగ్గుర్తి సంజీవరావు, మండల కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా, ఆవుల వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, షేక్ సుభాని, నక్క పుల్లారావు, పాల్గొన్నారు.
మోదీ గో బ్యాక్ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ మోకాళ్లపై నిరసన
నవతెలంగాణ ఖమ్మం
రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్న విభజన హామీలు అమలులో మోదీ ప్రభుత్వం విఫలం చెందిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికల రామకృష్ణ విమర్శించారు. శనివారం ఖమ్మంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, తరుణ్, సుధాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ సుభాని, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ పాల్గొన్నారు.
కూసుమంచి : మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు, విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు తప్పవని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్( మార్క్సిస్ట్ ), భారత కమ్యూనిస్టు పార్టీ ల జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్, గుండెపోగు మల్లేష్ అన్నారు. శనివారం పాలేరు నియోజకవర్గం సిపిఎం, సిపిఐ నాయకులు,రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మోడీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎడవెల్లి రమణారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి భూక్య నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, నండ్ర ప్రసాద్, సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుండెపోగు మల్లేశు, సిపిఎం పార్టీ నాయకులు ఊరడి సుదర్శన్ రెడ్డి, కె.వి.రెడ్డి, తోటకూరి రాజు, శీలం గురుమూర్తి, మల్లెల సన్మంతరావు, గంగాధర్, అంగిరేకుల నరసయ్య, మూడు గన్యా నాయక్, పెరుమలపల్లి మోహన్ రావు, నాగేశ్వరరావు, పొన్నెకంటి సంగయ్య, తుల్లూరి నాగేశ్వరరావు, వశపొంగు వీరన్న పాల్గొన్నారు.
ఖమ్మం : ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ కాలరాస్తున్నాడని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగ్ నరసింహారావు, బి.జి క్లెమెంట్, టిఆర్ఎస్ కేవి జిల్లా అధ్యక్షులు ఎండి యాకుబ్ పాషా అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రావడానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో ఖమ్మంలోని కొత్త మున్సిపాలిటీ నుండి కొత్త బస్టాండ్ వరకు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ కేవి ప్రధాన కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.
వైరా టౌన్ : కమ్యూనిస్టులు అంటే మోడీకి భయం పట్టుకుందని, అందుకే కమ్యూనిస్టులను ముందస్తు అరెస్ట్ చేశారని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర బాబు అన్నారు. శనివారం వైరా రింగ్ రోడ్డు వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను నిరసిస్తూ సిపిఐ(ఎం) సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు యామాల గోపాలరావు, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రాఘవరావు, హారి వెంకటేశ్వరరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శనివారం మధిర అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు, పట్టణ మండల కార్యదర్శులు మండవ ఫణీంద్ర కుమారి, మంద సైదులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, సిఐటియూ నాయకులు పడకండి మురళి, తేలప్రోలు రాధాకృష్ణ, అనుమోలు భాస్కరరావు, వెల్సన్ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : అరెస్టు చేసిన వారులో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, కృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణ, సిపిఎం మండల నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఇంటూరి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు పోటు సూరయ్య, సిపిఎం నాయకులు పద్మనాభుల సుధాకర్, రేపాకుల వెంకన్న, కొలిచలం స్వామి, నిర్మల్ రావు రవిలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు.
సత్తుపల్లి : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం సత్తుపల్లిలో నల్ల జెండాలతో ప్రదర్శన, రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బస్టాండ్ చౌరస్తాలో జరిగిన ధర్నా కార్యక్రమంలో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, దండు ఆదినారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాజబాబు, కొలికపోగు సర్వేశ్వరరావు, రమేశ్, హుస్సేన్ పాల్గొన్నారు.
కల్లూరు : సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు, దామల దయాకర్, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసారు.