Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పాఠశాల ఆవరణలో యుకెజి, ఎల్‌కెజి 1, 2వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిపి ఫ్యాషన్, ర్యాంప్ వాక్ పోటీలను, 3, 4, 5 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వన్ మినిట్ గేమ్‌లను నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కరస్పాండెంట్ కరస్పాండెంట్ పి. రవి మారుత్ , ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ ఏ పని అయినా ఒకే విధంగా చేయడం, చేయించడం వల్ల ఆ పనిలో నిరాసక్తత ఏర్పడుతుందని అన్నారు. కేవలం తరగతి గదులలో బోధన కొంతవరకే నేర్చుకొనే అవకాశం ఉంటుందని ప్రతిరోజు ఆరుబయట చక్కటి వాతావరణంలో వివిధ రకాల ఆటలు, ఎక్సీడ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ విద్యార్థులలో చైతన్యాన్ని, ఆసక్తిని పెంపొందించే విధంగా రోజువారీ కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతుందని దానిలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలలో వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందని పాల్గొన ప్రతిఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలయిన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ .పి.రవి మారుత్, ప్రిన్సిపల్ పార్వతీ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెచ్.ఎమ్. అరుణదీప్తి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.