Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వార్దపరమైన సర్వేలు చేయవద్దు : బొంతు రాంబాబు
నవతెలంగాణ-కామేపల్లి
70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గి కష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగులో ఉన్న ప్రతి పోడు సాగుదారుడికి హక్కు కల్పిస్తామని సర్వే బృందాలు ఏర్పాటు చేసి సర్వే చేయించుటకు ఆదేశించగా ఫారెస్ట్ అధికారులు మాత్రం 70 సంవత్సరాలు సాగులో ఉన్న భూములు కూడా సర్వే చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. శనివారం మండలంలోని జాస్తి పల్లి, మద్దులపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే చేయకుండా ఇబ్బందులకు గురి చేయటం సరికాదని అన్నారు. మైదాన ప్రాంతంలో పంటల కంటే మెరుగైన పంటలు పత్తి, మిర్చి, వరి పంటల సాగువుతున్నాయని అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ అధికారుల ద్వారానే చెక్ డాం నిర్మాణం, విద్యుత్తు లైన్లు,బోర్లు ప్రభుత్వం ద్వారా అధికారులు ఏర్పాటు జరిగిందని అన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు సర్వే చేయకుండా నిరాకరించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వజ్జా.రామారావు, దేవేంళ్ళ. వీరభద్రం, ఆనందరావు, సీతారాములు, విద్యా యంకన్న, ఉప్పతల వెంకన్న, వందలాదిమంది మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.