Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో శనివారం ఆట బాలోత్సవం వేడుక ప్రారంభమైంది. భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఈ వేడుకను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. బక్కంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భాలోత్సవం వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు తమ కళా ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాత సత్రం దాత జి.ఎస్.పి వీరారెడ్డి దంపతులు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ లక్ష్మీగిరి ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి నరేష్, దేవాలయ ప్రధాన అర్చకులు రామం, దేవాలయ మాజీ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు, శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి వేంపాటి ఉషారాణి, ఆట రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జనార్ధన్, ఆట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకట్రెడ్డి, ఆట ఉపాధ్యక్షులు నయుముద్దీన్, ఆట బాధ్యులు జమీల బేగం, కేఎస్ నాయుడు, వెంకటరామయ్య, చక్రవర్తితో పాటు ఆర్గనైజర్లు రాజేందర్ నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.