Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మోడీ గో బ్యాక్ నిరసన కార్యక్రమానికి వెళుతున్న సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి, మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామనాథం, మండల కార్యదర్శి కేశవరావు ఎన్డీ జిల్లా నాయకులు షేక్ ఉమర్, మండల కార్యదర్శి వెంకట్రావు తదితరులు ఉన్నారు.
బూర్గంపాడు : సీపీఐ(ఎం), సీపీఐ నాయకులను ముందస్తుగా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల నాయకులు రాయల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సమితి నాయకులు పేరాల శ్రీనివాస రావులను అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశంలో మత తత్వాన్ని పెంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
ఇల్లందు : సింగరేణి బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ తదితర అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రధాని మోడీ గో బ్యాక్ అంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ అడ్డాపై శనివారం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, భాస్కర్, శ్రీను, రవి, రాజు, మహేష్ రాము, కుమార్.తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) , సీపీఐ, న్యూడెమోక్రసీ నేతల ముందస్తు అరెస్టులు
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ కార్యక్రమాలు చేయకుండా సీపీఐ(ఎం), సీపీఐ, న్యూ డెమోక్రసీ నాయకును పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దేవులపల్లి యాదయ్య, అబ్దుల్ నబీ, శంకర్, నాగయ్య, నరసింహారావు తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మోడీ గో బ్యాక్ నినాదంతో దద్దరిల్లిన బొగ్గు బావులు
ప్రయివేటీకరణకు పూనుకొంటున్న ప్రధాని గోబ్యాక్ అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. దీంతో బొగ్గు బావులు దద్దరిల్లాయి. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఎస్.రంగనాథ్, వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సింగరేణి మైన్స్, డిపార్ట్మెంట్స్లు మోడీ వ్యతిరేక నినాదాలు చేశారు. రంగనాథ్ మాట్లాడుతూ లాభాలలో నడిచే సింగరేణినీ ప్రయివేట్ వాళ్లకు కట్టబెట్టేందుకు సింగరేణి అభివృద్ధి చేసిన బ్లాకులను వేలంపాట పెట్టాడని అందుకే ఈ గడ్డమీద కాలుపెట్టొద్దని మోడీని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శులు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, చండ్ర వెంకటేశ్వర్లు, గౌస్ మియ, దరియసింగ్ పాల్గొన్నారు.
మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ నిరసన
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం మండలంలోని ముకుందాపురం క్యాంపు సెంటర్లో హమాళి కార్మికులతో నల్ల బ్యానర్‌తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా నాయకులు చిత్తారి వెంకన్న, తొండల సర్వయ్య, పూనెం లక్ష్మణరావు, మల్లేష్ పూనెం చందు, మూతి కొటేస్, వర్స రవీందర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ(ఎం) మండల నాయకులు కొప్పుల శ్రీనివాసరావు అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టుల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల హమాలీ అధ్యక్షుడు కామినేని రమేష్, కుతాటి శ్రీనివాసరావు, నాయకులు భోగి నరసింహారావు, సీఐటీయూ నాయకులు కోటా సుబ్బారావులను ముందస్తు అరెస్టులు చేశారు.
అదేవిదంగా సీపీఐ నాయకులు మండల సహాయ కార్యదర్శి సంంకుపాక ధర్మ, ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాములను ఉదయం ఆరు గంటలకి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు మాట్లాడారు.
మణుగూరు : ముందస్తుగా సీపీఐ(ఎం) నాయకులను పోలీస్‌లు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మండల కార్యదర్శి కొడిశాల రాములు, మండల కమిటీ సభ్యులు వైనాల నాగలక్ష్మి, ఆఫీస్ సెక్రటరీ గుర్రం నరసయ్య, కెవిపిఎస్ మండల కార్యదర్శి నాగేల్లి శ్రీనివాస్ ఉన్నారు.
టీబీజీకేఎస్ నేతృత్వంలో : టీబీజీకేఎస్ నేతృత్వంలో కార్మిక వర్గం నల్ల జెండాలతో నినాదాలు అందించారు. ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు నేతృత్వంలో ఓసీ 2 గని నందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభాకర రావు మాట్లాడారు. కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవుఫ్, బ్రాంచి నాయకులు వీరభద్రయ్య, బ్రాంచి సెక్రెటరీ బానోత్ కృష్ణ, కాపా శివాజీ, ఏస్వీఎస్ఎన్ వర్మ, సీహెచ్ వెంకటేశ్వర రెడ్డి, అశోక్, ఫిట్ సెక్రటరీలు నాగెల్లి, రామరావు, గంగాధర్, టీబీజీకేఎస్ నాయకులు, శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : సీపీఐ(ఎం), సీపీఐ నాయుకులును ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం అని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి వెంకటరత్నం విమర్శించారు. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం వస్తున్ను సందర్భంగా అన్నపురెడ్డిపల్లి పోలీస్ శాఖ సిబ్బంది ముందస్తు అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఐటీయూ మండల కార్యదర్శి సురేష్, కోటయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.