Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్
నవతెలంగాణ-ఇల్లందు
రాజి మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా ఉంటుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ జనమంచి ముఖేష్ అన్నారు. కోర్టులో ఆవరణలో శనివారం జరిగిన న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని కక్షిదారులకు కోర్టు న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది అన్నారు. కేసు ముగిసే వరకు కోర్టు ఏర్పాటుచేసిన న్యాయవాదినే వాదనలను వినిపిస్తారని తెలిపారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ పడినదగిన కేసులు రాజీ పడినట్లయితే ఇరువురి పార్టీలకి సమాన న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాదాలత్ మెంబర్ పైల జయ ప్రకాష్, ఏపీపీ రచిత, ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.మహేశ్వర్ రావు, సీనియర్ న్యాయవాదులు ఎన్.చెన్నకేశవరావు, ఎన్.మల్లికార్జున్ రావు, ఆనంద్, గోపీనాథ్, ప్రభాకర్, రవి కుమార్ నాయక్, ఉమామహేశ్వరరావు, కీర్తి కార్తిక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.