Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ-అశ్వారావుపేట
సమాజంలో ప్రతిఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో శనివారం నిర్వహించిన మున్నూరు కాపు కాపు కార్తీక వన సమారాధనకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నూరు కాపు భవన్ సాధించుకోగలిగామన్నారు. ప్రతి నియోజకవర్గ కేందరంలో సంఘ భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం దక్కేవిధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి రంగారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అకుల గాంధీ, విశ్రాంత డిఎస్పీ కె.ఎస్.నర్సయ్య, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, నిర్మల పుల్లారావు, యూఎస్ ప్రకాశరావు, తాడేపల్లి రవి, కురిశెట్టి నాగబాబు, మద్దాల నాగేశ్వరరావు, సంగీతం బుల్లియ్య, మాధురి మధు పాల్గొన్నారు.
వినాయకపురంలో ఆరు సీసీ రోడ్లు మంజూరు చేసిన వద్దిరాజు
అశ్వారావుపేట నుంచి నారాయణపురం వెళుతూ మార్గమధ్యంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు తన అనుచరులతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ పూజల అనంతరం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆరు సీసీ రహదారులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే కొద్దిసేపు క్రికెట్ ఆడి అక్కడి యువకులకు క్రికెట్ కిట్' సామగ్రికి సహాయం చేశారు.