Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత
నవతెలంగాణ-ఇల్లందు
వచ్చే నెల రోజుల కాలంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోడు భూముల సమస్య వల్ల కేవలం గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు భూమిపై హక్కును పొందే విధంగా అవకాశం కల్పించే విధంగా ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసిందని తెలిపారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే రూ.19 వేల కోట్లను ఇవ్వకుండా కేవలం ఒక కుటుంబ స్వలాభం కోసం మునుగోడులో బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్లతో కాంట్రాక్ట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలవడం రాష్ట్రం మీద వివక్షతను చూపుతోందన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు నియోజకవర్గం రెండు జిల్లాల ఉమ్మడిగా ఉన్నప్పటికీ కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీలలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయకపోవడం రాష్ట్రం మీద ఉన్న వివక్షతను తెలుపుతుందని ఎంపీ కవిత అన్నారు. కానీ సీఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.