Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేట మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డ్ నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించి, మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు తేవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే తూకాలు వేసిన ధాన్యం బస్తాలను తరలించి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. దళారులకు ధాన్యం అమ్మువద్దని రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంపై చిన్న చూపు చూసినప్పటికీ మనకు అండగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సుగ్గల నరసింహారావు, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, కోయ్యాల అచ్యుత్ రావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, వార్డ్ మెంబర్ పగడాల రాంబాబు, బోగెం సత్యం, యేసు, రాంబాబు, చిరంజీవి, శివ తదితరులు పాల్గొన్నారు.