Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుర్రం వెంకటనర్సయ్య మామిడి తోటలో కార్తీకమాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. మేదరమెట్ల స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రివర్యులు పువ్వాడ అజరుకుమార్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ, నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వయసు మీద పడిన ఎన్ఆర్ఐ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా బాధ్యులు ఆదుకోవాలన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఇతర దేశాలలో ఉన్న తమ పిల్లలు ఆనందపడతారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నా సహకారం అందిస్తానని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సామాజిక స్ఫూర్తిని కల్గిస్తాయని అన్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఎన్ఆర్ఐ పిల్లల తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ సభలో జిల్లా గ్రానైట్స్ అసోసియేషన్ కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, సర్పంచుల సంఘం నాయకులు పుసులూరి నరేందర్, కానూరి హిమబిందు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శివర్గ సభ్యులు, గౌరవాధ్యక్షులు బత్తినేని నీరజ, డిసిపి సుభాష్ చంద్రబోస్, రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, అమెరికా తానా సంఘం నాయకురాలు బిందులత పాల్గొన్నారు. సాయంత్రం మహిళలకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతము ఆనందోత్సవములతో జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి సంధ్యశ్రీ, పారుపల్లి ఝాన్సి, రాములమ్మ, మధురవాణి, మమత, పద్మజ, ఝాన్సి, ఎన్.పద్మ, జయసుజాత, గానప్రియ, దుగ్గి లక్ష్మి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.