Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ-ఖమ్మం లీగల్
ఖమ్మం పట్టణం అల్లిపురం రోడ్లో గల చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఖమ్మం న్యాయవాదుల వన సమారాధన కార్యక్రమంలో న్యాయవాదులు కుటుంబాలతో పాల్గొని ఆనందంగా ఆహ్లాదకరంగా సమయాన్ని గడిపి విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి (రిటైర్డ్), జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ కాజశరత్, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ వనసమారాధనాలో బాగంగా శివాభిషేకం, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలను న్యాయవాదులు ఆసక్తిగా తిలకించినారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులును శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ ప్రధాన కార్యదర్శి తులసి వెంకటేశ్వర్లు, వి.వీరెందర్, బార్ కార్యవర్గం, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.