Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
న్యాయసేవాధికార సంస్థ తరుపున గ్రామాల్లో న్యాయ సలహాలు అందించే పారా లీగల్ వాలెంటీర్లు మంచి సలహాలు ఇవ్వాలని, ఒక మంచి సలహా జీవితాన్ని నిలబెడుతుందని ఖమ్మం జిల్లా జడ్జి, న్యాయ సేవా సంస్థల చైర్మన్ డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం న్యాయ సేవా సదన్‌లో జరిగిన న్యాయ విజ్ఞానం ద్వారా పౌర సాధికారికత మరియు మాకు హక్కులు ఉన్నాయి. క్యాంపెయిన్ ల ముగింపు సమావేశానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా వాలెంటీర్లు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఆడ పిల్లలకు కట్నాలు ఇవ్వద్దని, మగ పిల్లలకు కట్నం తీసుకోవద్దని, అప్పుడే వరకట్న రహిత సమాజం నిర్మితమవుతుందన్నారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా మాట్లాడుతూ క్యాంపెయిన్ విశేషాలను వివరించారు. గ్రామ పంచాయతీలలో అవగాహన కల్పించడానికి ఖమ్మం జిల్లాలో 21 బృందాలను ఏర్పాటు చేయగా 479 గ్రామలలో అవగాహన కల్పించినట్లు వివరించారు. జైలు సందర్శనలో బాగంగా 13 మంది ముద్దాయిలకు న్యాయ సహాయం అందించినట్లు మరొక 10 మంది ముద్దాయిల న్యాయ సహాయ దరఖాస్తు లను ఆయా జిల్లా న్యాయ సేవా సంస్థలకు పంపినట్లు వివరించారు. అనంతరం ఇరు కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన న్యాయవాదులకు, పారా లీగల్ వాలెంటీర్లుకు న్యాయ శాఖ విద్యార్థులకు చైల్డ్ లైన్ వాలెంటీర్లకు న్యాయమూర్తులు ప్రశాంసా పత్రాలు అందజేశారు.