Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-కొణిజర్ల
వ్యవసాయ సీజన్లో వందలాది ఎకరాల్లో మిర్చి పంట వేరు కుళ్లుడు, తామర పురుగుతో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంట నష్టం పై సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని లాలాపురం గ్రామంలో మిర్చి పంటలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరాకు లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టి రైతుల నష్టపోతున్నారని గత సీజన్లోనూ తామర పురుగు వల్ల లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని అన్నారు. ఈ సీజన్లోనైనా ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సంక్రాంతి నర్సయ్య, రైతులు సంక్రాంతి పురుషోత్తం, మండవ బ్రమేశ్వర్రావు, ప్రభాకర్, పాష పాల్గొన్నారు.