Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలుపట్టవు
- మునుగోడు ఎన్నిక ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
- సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ నష్ట పరుస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ విషం చిమ్ముతుందని, ఓట్లు కోసం అధికారం కోసం రాజ కీయ క్రీడ ఆడుతున్న మోడీ వలన, దేశానికి సమాజానికి ప్రమాదం పొంచి ఉందని సీఎల్పీ లీడర్ మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క బిజెపి ప్రభుత్వంపై మండి పడ్డారు. మండల పరిధిలోని తక్కెళ్ళపాడు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సేలం అక్కమ్మ ఇంట్లో అన్న ప్రాసన కార్యక్రమానికి హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో రాష్ట్ర అభివృద్ధికి విభజన చట్టం లోనే కొన్ని వసతులను, ఆర్థిక వనరులను, పొందు పరచటం జరిగిందని అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో అంశాలను, హక్కులను చేర్చారని చట్టం ద్వారా ఆ హక్కుల కోసం పోరాడాల్సిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం పోరాటాలు చేయకుండ నిస్తేజంగా ఉండి పోయిందని విమర్శించారు. బిజెపికి దేశం సమాజం కంటే అధికారమే పరమావధిగా రక్త పాతాన్ని సృష్టిస్తూ, అవినీతి పాలన చేస్తుందని అన్నారు. ప్రజలకు నష్టం కలగ కుండా దేశ సంపదను పంచి పెట్టాలని అన్నారు. జూడో యాత్రలో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, ప్రతాపరెడ్డి, శీలం నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, రాజీవ్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.