Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పినపాక
వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రోస్ రోడ్లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య హాజరయ్యారు. సమావేశానికి ముందు ఏఐఏడబ్ల్యూ జెండాను జిల్లా కార్యదర్శి కనకయ్య ఆవిష్కరించారు. అనంతరం జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం 'కూలీ బంధు' పథకాన్ని ప్రవేశ పెట్టి రూ.లక్ష ఇవ్వాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయాలన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఈ మహాసభలో ఎన్నుకున్నారు. పినపాక మండల అధ్యక్షురాలుగా కబ్బాక సరళ, కల్తీ నాగేశ్వరరావుతో పాటు 20మంది కమిటీ సభ్యులని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న, గోవర్ధన్, రమేష్, వందలాదిగా పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.