Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
నేటి సమాజంలో ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యమని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కాసాని లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లా డుతూ నేటి సమాజంలో ప్రజలు వారి పనులలో బిజీగా ఉంటూ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. దీనివలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. వీటిని అధిగమించడానికి పోషక ఆహారం ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, మండల కార్యదర్శి వీర్ల రమేష్, నల్లగోపు పుల్లయ్య, ఉడుగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.