Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తెస్తాం
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్ర జనాభాలో 22 శాతంగా ఉన్న మున్నూరు కాపుల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇప్పటికే హైదరాబాదులో ఆరు ఎకరాల స్థలాన్ని సంఘానికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇల్లందు మండలంలో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ఎంపీ నిధుల నుండి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మండలంలోని ఓసీ సమీపంలోని మామిడి తోట వద్ద ఆదివారం మున్నూరు కాపుల సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు కొత్తగూడెం వరంగల్ ఎమ్మెల్యేలు హరిప్రియ వనమా వెంకటేశ్వరరావు, దాస్యం ప్రణయ భాస్కర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల సీతామహాలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. మున్నూరు కాపుల మున్నూరు కాపులు అట్టడుగు స్థాయి నుండి ఎంతో కృషి చేసి ప్రజా ప్రతినిధులుగా, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా, సింగరేణి ప్రభుత్వ పదవుల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. కింది స్థాయి మున్నూరు కాపులకు, అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈయన రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు పట్టణం మండలంలోని మున్నూరు కాపులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
12 ఏళ్ల అనంతరం మున్నూరు కాపుల వన సమారాధన ఇల్లందులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలకతీతంగా కాంగ్రెస్, టీడీపీ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు దిండిగాల రాజేందర్, ఎస్.రంగనాథ్, పులి సైదులు, ముద్రగడ వంశీ, సిటీ కేబుల్ న్యూస్ రీడర్ చందు, పింగళి హౌండా అధినేత నరేష్, అఖిల్ సెల్ పాయింట్ అధినేత పాలెపు ఆనంద్ తదితరుల సారధ్యంలో నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ ఎమ్మెల్యే వినయ భాస్కర్, కొత్తగూడెం, ఇల్లందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతామాలక్ష్మిలకు గజమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన కౌన్సిలర్లు వైస్ ఎంపీపీ, వార్డు మెంబర్లను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.