Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్గా చర్ల మండలం పులిగుండాల సర్పంచ్ సోడి చలపతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నియమించినట్లు తెలిపారు. ఆదివారం భద్రాచలంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్ల మండలం పులిగుండాల గ్రామ సర్పంచ్ సోడి చలపతి కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నందున పార్టీ అభివృద్ధి దృష్ట్యా చలపతిని భద్రాద్రి ఎస్టీ సెల్ వైస్ చైర్మన్గా నియమించి ఉత్తర్వులు జారీ చేసినట్లు టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, బుడగం శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి, బలుసు నాగసతీష్, తోటమల్ల సంగీతరావు, కానుబుది దేవా, ఉబ్బ వేణు, సరేళ్ళ వెంకటేష్, వెంకటేశ్వరరెడ్డి, రంగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.