Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
పినపాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలలోనీ కృష్ణ సాగర్లో జరిగిన సమావేశంకు బీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు గోనెల నాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని ఆయన అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని, పినపాక నియోజక యూత్ సభ్యులు, మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడులు మాట్లాడారు. భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావుతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కృష్ణ సాగర్ గ్రామ యూత్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షులుగా భూక్యా సురేష్, ప్రధాన కార్యదర్శిగా అంతోటి నాగరాజు, ఉపాధ్యక్షులుగా పాయం వీరభద్రయ్య, మడవి రాజేష్, జాయింట్ సెక్రటరీ గా పద్దంరాజు, సోడే శ్రీనులను గ్రామ యువతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి యడమ కంటి సుధాకరరెడ్డి, సర్పంచ్ కొడెం వేంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ గోవింద్, సీనియర్ నాయకులు ఉండేటి గోవర్ధన్, మండల వైస్ ప్రెసిడెంట్లు బోనం నాగి రెడ్డి, సారెడ్డి అశోక్ రెడ్డి, మండల యూత్ నాయకులు, కోట రమేష్, మందా ప్రసాద్, సుధాకర్, మహేశ్ కృష్ణ సాగర్, గ్రామ కమిటీ అధ్యక్షులు అంతోటి రమేశ్, సొసైటీ డైరెక్టర్ ఉందేటి గోవర్ధన్, లోక్యా, వార్డు మెంబర్ వుసిళ్ల రాజేష్, రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.