Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. పాల్వంచ ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మహాసభ ఆదివారం జరిగింది. ఈ మహాసభలో పాల్గొన్న నరాటి ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం మల్టీ పర్పస్ విధానం వలన పనులు విపరీతంగా పెరిగి పోయిందని, అన్ని రకాల పనులు సమయం లేకుండా 24 గంటల చేపిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, 2011 జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించి నలుగురు చెయ్యాలిసిన పని ఒక్కరితో శ్రమ చెపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చెయ్యాలని, పీఎఫ్, ఈఎస్సై, ఇన్సూరెన్స్, పెన్షన్ రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, డేట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, కొబ్బరి నూనె, షోప్స్, యూనిఫామ్, బూట్లు, గ్లౌస్లు, సెలవులు 28 ఏడాదికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వాసిరెడ్డి మురళి, యార్లగడ్డ భాస్కర్ రావు, వీసంశెట్టి పూర్ణ చంద్ర రావు, అన్నారపు వెంకటేశ్వరవు, విశ్వేశ్వరరావు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.