Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం దేశానికి ప్రమాదకరమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ అన్నారు. స్థానిక కో ఎడ్యుకేషన్ పాఠశాలలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 4న మణుగూరులో యూటీఎఫ్ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి అన్నారు. ఈ మహాసభల విజయవంతానికి పురోగతిపై సమీక్ష జరిగింది. జిల్లా మహాసభలను జయప్రదం చేయడానికి ప్రతి ఉపాధ్యాయులు మహాసభ ఏర్పాట్లలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. ఈ విద్యా వైజ్ఞానిక సభలో సేవా నిబంధనలు, విద్యా రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, సమస్యలు పరిష్కార మార్గాలు తీర్మానాలు, ప్రభుత్వ విద్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్థాయిలో సమీక్షా జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి.మురళిమోహన్, కోశాధికారి యస్.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు బి.రాము, బిక్కు, జయరాజు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మీరా హుస్సేన్, కారం సీతారామయ్య, మహిళ ఉపాధ్యక్షురాలు విజయ లక్ష్మి, సీనియర్ నాయకులు కుమారస్వామి, పినపాక మండల ప్రధాన కార్యదర్శి బి.భాస్కర్రావు, ఉపాధ్యక్షులు కిరణ్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.