Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఓ స్వర్ణలత
నవతెలంగాణ-కొత్తగూడెం
సమస్య పరిష్కారానికి ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ స్వర్ణలత తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశామని చెప్పారు. ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.