Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల జగదీష్ కాలనీ భద్రాచలం నందు స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ప్రోగ్రాంలో భాగంగా విద్యా జ్యోతి సీఎస్ఆర్ ఫండ్స్ కెనరా బ్యాంక్ భద్రాచలం వారి సహకారంతో పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. ఏడో తరగతి విద్యార్థినీ చరిష్మా, ఆరవ తరగతి విద్యార్థిని ఆదర్శ, ఐదో తరగతి విద్యార్థి అలేఖ్యకు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ చేతుల మీదగా తలా రూ.2,500 చొప్పున మొత్తం రూ.7500 పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు. కెనరా బ్యాంక్ భద్రాచలం శాఖ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్, ఉపాధ్యాయులు జ్యోతి కుమార్, లక్ష్మి, రామకృష్ణ, రమేష్, జె.శ్రీను, శ్రీనివాసరావు, ఎస్.విజరు కుమార్, ఆశాలత పాల్గొన్నారు.
ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్
అసోసియేషన్ కార్యాలయంలో
ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భద్రాచలం ఎస్టీఓ సుభద్ర సుందరనవమని, మణి, నాగలక్ష్మి, ఉమాదేవి, డి.కృష్ణమూర్తి, శివప్రసాద్, సుబ్బారావు, చుక్క రాంబాబు, ఎంవీస్ నారాయణ, మాదిరెడ్డి, సుబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొని నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పినపాక : ఎక్సెలెంట్ భాష హై స్కూల్ బయ్యారంలో బాలల దినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు ముఖ్య అతిధిగా ఎక్సెలెంట్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి.యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం గురించి వివరించి, వారిలో స్ఫూర్తిని నింపి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహిం చడం జరిగింది. పోటీలలో గెలుపొందిన విద్యా ర్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఎక్సెలెంట్ విద్యా సంస్థల డైరెక్టర్స్ ఎండీ ఖాదర్, ఎండీ గబ్బర్, ముక్కు వెంకట నర్సారెడ్డి, నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : అన్ని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆయా పాఠశాలల్లో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, మండల విద్యాశాఖ అధికారిగా, జిల్లా విద్యాశాఖ అధికారిగా తరగతులలో బోధించారు. గౌరవరం ఆశ్రమ పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు ఇర్ఫా అనసూయ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ములకలపల్లి : మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండలంలోని తిమ్మంపేట ప్రాథమికొన్నత పాఠశాల లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎం శంకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనం తరం ఉత్తమ ప్రతిభ కనబర్చి వారికి బహుమతి ప్రధానం జరిగింది. అదేవిధంగా దావరాలపల్లి పాఠశాలలో హెచ్ఎం రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమ తులు పంపిణీ చేశారు. అదేవిధంగా ములకలపల్లి ప్రాథమిక పాఠశాలలో సిస్టర్ రాజ్యం బాలలది నోత్సవం సందర్భంగా పిల్లలకు పెన్నులు, పెన్సిళ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు సరోజ, రాధ, వద్దు, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి నెహ్రూ జయంతి సందర్భంగా తోటి విద్యార్థులుకు గురువులుగా పాటలు బోధించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మండలంలోని న్యూ ఆక్స్ ఫర్డ్ పాటశాలలో చిన్నారులు చీరలు ధరించి బాలలు పంచెలు ధరించి గురువులుగా పాటలు బోధించి ఎంతో ఉత్సహాంగ బాలల దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాటశాల ప్రిన్సిపాల్ విజరు భాస్కర్ మాట్లాడుతూ రోజూ పాటలు వినే విద్యార్థులు, చిన్నారులు గురువులు ముందు పాఠాలు బోధించడం చూడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు.