Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
సహకార సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీఎంఎస్ వైస్ చైర్మెన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 69వ సహకార వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం పాల్వంచ సొసైటీ కార్యాలయం ఎదుట కొత్వాల పతాకావిష్కరణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 14వ తేది నుండి 20వ తేది వరకు సహకార వారోత్సవాలు జరుగుతాయని, రైతులకు సహకార వ్యవస్థ ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ్మోహనరావు, కనగాల నారాయణరావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్య కిషన్, సీఈఓ జి.లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, లక్ష్మి, శోభారాణి, రైతులు పూసల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అఖిల భారత 69వ సహకర వారోతసవాల సందర్భంగా సొసైటి చైర్మెన్ మండె వీరహనుమంతరావు సోమవారం సహకార జండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగ అభివృద్ధికి ఎందరో భాహనుబావులు కృషి చేశారని చెప్పారు. సహకార వ్యవస్థను బలోపేతం కోసం రైతు తన వంతు కృషి అందించాలని కోరారు. ఈ వారం రోజులు సహకార వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటి డైరెక్టర్స్ మాలోతు సేవ్యా, చంద్రగిరి శ్రీని వాస్, సంఘం సీఇఓ పండ్ల సారయ్య, చుంచుపల్లి ఉప సర్పంచ్ శ్రీహరి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జిల్లా సహకారం కార్యాలయంలో వేడుకలు...
సహకార వారోత్సవాల వేడుకలను జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వర్లు సహకార జెండా పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించి, సహకార ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి సహకార వ్యవస్థను పటిష్ట పరచవలసిన అవశ్యకత ఎంతో ఉందని అన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల పరిధిలోని గుంపెన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి 69వ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సున్నం వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ మామిళ్ళపల్లి రామారావు, సొసైటీ డైరక్టర్లు దావా రామయ్య, రాంబాబు, రైతులు పాల్గొన్నారు.
మణుగూరు : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారోత్సవాలు నిర్వహించినట్టు పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం మణుగూరు పీఏసీఎస్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజలు ధాన్యాన్ని ప్రభుత్వ కల్లాలు వద్ద అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.