Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ డా.టి.భరత్కృష్ణ
నవతెలంగాణ-పాల్వంచ
ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విధానంలో మార్పు ఉండాలని మార్పుల గురించి కాకుండా సబ్జెక్లుపై అవగాహన చేసుకుని పోటీ పరీక్షలలో నెగ్గాలని అప్పుడే జీవితంలో చక్కగా స్థిరపడతారని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ టి.భరత్కృష్ణ అన్నారు. సోమవారం స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటిసంవత్సరంలో నూతనంగా ప్రవేశించిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఆన్లైన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఒక చదువే కాకుండా వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ 4 సంవత్సరాలలో విద్యార్థులు మంచి ఇంజనీర్లుగానే కాక మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.యంవి సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.