Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైద్రాబాద్ ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబిబీఎస్ తొలి విద్యాసంవత్సరం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు సీఎం కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. నూతనంగా నిర్మించిన కొత్తగూడెం మెడికల్ కాలేజిలో 150 మెడికల్ సీట్లు ఉన్నాయి. మొదటి ధపాలో ఇప్పటికే 92 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు పొందారు. మరో దఫాలో మిగిన సీట్లు పొందే అవకాశం ఉంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో కాలేజి నిర్మించారు. ఇప్పటికే బోధన, బోధనేతర సిబ్బంది నియామకం జరిగింది.