Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సీఐటీయూ జిల్లా మూడో మహాసభలు భద్రాచలం పట్టణంలో ఈ నెల 16, 17 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవి. భద్రాచలం పట్టణాన్ని సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికులు యూనియన్లు హౌర్డింగ్లు, ఫ్లెక్సీలు, జెండాలు తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 16వ తారీకు జరిగే కార్మిక ర్యాలీలో వేలాదిమంది కార్మికుల పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ విధానాలు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో సీఐటీయూ కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించబోతున్నట్లు పట్టణ కన్వీనర్ ఆహ్వాన సంఘం కోశాధికారి వైవిరామారావు తెలిపారు. అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన వార్డింగ్ భవన నిర్మాణ కార్మికులు హమాలీ కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రమేష్, రాజబాబు, మధు, అన్నవరం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.