Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశ మొదటి మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని వివిధ పాఠశాలల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లల నృత్య ప్రదర్శనలు, ఫాన్సీ డ్రెస్, ముఖ్యంగా చాచా నెహ్రూ, గాంధీ ఇతర దేశనాయకుల వేషధారణలో అలరించారు. చిన్నపిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలు మాట్లాడారు.'' నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు'' అని వారిలో చిన్న నాటి నుంచే గాంధీ, నెహ్రూ, అబ్దుల్ కలామ్, మథర్ తెరిస్సా, ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయుల జీవితాలను స్పూర్తిగా తీసుకుని ఉత్తములుగా తీర్చి దిద్దాలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య విద్యాలయం పాఠశాల యాజమాన్యం లయన్. ఎంవి. చౌదరి, ఎంవి. చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రనగర్‌లో
ఇంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మేకల జ్యోతి రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిడిపిఓ కనకదుర్గ, శ్రీనగర్ కాలనీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, ఎస్బిఐ లక్ష్మీదేవి పల్లి శాఖ మేనేజర్ మురళి, శ్రీనగర్ ఎంపీటీసీ కొల్లు పద్మ పాల్గొన్నారు. ఉపసర్పంచ్ రమేష్ చంద్ మాట్లాడారు. పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పాషా, టీవీపిఎస్ అధ్యక్షులు గుండపనేని సతీష్, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుండి కాసిం, రిటైర్డ్ డీటీ నాగరాజు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాగాలో బాలల దినోత్సవం
కొత్తగూడెం రాగా స్కూల్లో బాలలదినిస్త్సవం నిర్వహించారు. ముందుగా యాజమాన్యం మల్లారపు వర ప్రసాద్, మల్లారపు కవితలు చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఫాన్సీ డ్రెస్‌లు అలరించాయి. గత నెల నుండి నిర్వహించిన 4 వారాల ''బ్రిలియంట్ మైండ్స్ గ్రాండ్ ఫినాలే'' ప్రోగ్రాంలో గెలుపొందిన విజేతలకు బ్రిలియంట్ మైండ్స్ అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు..
త్రివేణిలో ...
కొత్తగూడెంలోని లక్ష్మీదేవి పల్లి త్రివేణి పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలను ముందుగా రంగవల్లులతో, బెలూన్లతో అలంకరించారు. త్రివేణి పాఠశాలల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ మహానుభావుని జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ నృత్యాలతో, వేషాధారణలతో ఉత్సాహంగా అందరిని అలరించారు. ఈ సందర్భంగా త్రివేణి పాఠశాల డైరెక్టర్ జగదీష్. సీఆర్ఓ. మురళీకృష్ణ, ప్రిన్సిపల్స్ సురేష్, శ్రీనివాస్ సింగ్, కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ సౌజన్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.